తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని 117వ వార్డులో వివిధ ప్రాంతాల్లో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు.స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు కాలనీల అభివృద్ధి లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ.178.10 లక్షల అంచనా వ్యయంతో ఈ పనులను చేపట్టనున్నారు. రోడ్ల నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తగ్గి, రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ మల్లయ్య, ఇంజినీరింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
