తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే నివాసం వద్ద మహిళా సంఘ సేవకురాలైన సుజాత గౌడ్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుజాత గౌడ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
