తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ జన్మదినం సందర్భంగా కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హమీద్ పటేల్ ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఆయన చేస్తున్న సేవలు మరింత విజయవంతంగా కొనసాగాలని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు అందుకోవాలని హమీద్ పటేల్ ఎమ్మెల్యే గాంధీకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.