దేవీ నవరాత్రుల ఐదో రోజు ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

మేడ్చల్ జిల్లా, కాప్రా మండలం: దేవీ నవరాత్రుల సందర్భంగా జవహర్ నగర్‌లోని శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయంలో ఐదో రోజు శ్రీ గౌరీ మాతను విశేషంగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం అమ్మవారికి పంచామృతాలు, పండ్లతో అభిషేకం నిర్వహించిన అనంతరం ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నారు.

జై బోలో గౌరీ మాతాకీ జై! హర హర మహాదేవ శంభో శంకర!

నవరాత్రుల ఐదో రోజు శ్రీ గౌరీ మాత అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడంతో భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

ప్రతిరోజూ ఉచితంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు

శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం భక్తుల ఆధ్వర్యంలో ఉచితంగా అమ్మవారి అభిషేకం, కుంకుమార్చనతో పాటు లలితా సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నారు. భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాలను మార్కండేయ ఆలయ కమిటీ, జవహర్ నగర్, బాలాజీనగర్, మార్కెట్ గల్లీ ప్రాంతాల భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నారు.

 

Avatar photo

By Murthy