తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే నివాసం వద్ద స్థానిక సీనియర్ నాయకులైన గొట్టిముక్కల వెంకటేశ్వర రావు ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గొట్టిముక్కల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, ఆ భగవంతుని ఆశీస్సులతో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.