• ‘చేనేతల రోడ్ మ్యాప్–2028’ తీర్మానం
• మరో ఐదు బీసీ కులాలతో కొత్త సామాజిక సమీకరణం
• 20 శాతం ఓటు బ్యాంకుతో సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర లక్ష్యం
• తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశకు పునాది

న్యూస్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో బీసీలు రాజ్యాధికార దిశగా ముందుకెళ్లాలని, అందులో భాగంగా చేనేత కులాలు క్రియాశీల పాత్ర పోషించాలని హోటల్ రమడ మనోహర్, హైదరాబాద్ లో ‘చేనేతల రోడ్ మ్యాప్–2028’ పేరుతో జరిగిన కీలక సమావేశంలో చేనేత కుల మరియు ఉద్యమ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు కీలక తీర్మానం ఆమోదించారు. మరో ఐదు బీసీ కులాలతో కలిసి కొత్త సామాజిక సమీకరణాన్ని రూపొందించి, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 శాతం ఓటు బ్యాంకును సమీకరించి తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, అవసరమైతే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని లేదా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని నిర్ణయించినట్లు నాయకులు ప్రకటించారు. కార్యక్రమ రూపకర్త, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టీ.చిరంజీవులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణలో చేనేతల సామాజిక, రాజకీయ బలాన్ని వివరించారు. తెలంగాణలో చేనేతల జనాభా సుమారు 3.7 శాతం ఉన్నప్పటికీ, 20 నియోజకవర్గాల్లో చేనేత ఓటు బ్యాంకు బలంగా ప్రభావం చూపగల స్థాయిలో ఉందని వివరించారు. కొన్ని జిల్లాల్లో చేనేతల ఓటు శాతం 6 నుంచి 12 శాతం వరకు ఉండటం వల్ల రాజకీయంగా నిర్ణాయక శక్తిగా ఎదగగల సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో బీసీ కులాలు రాజకీయ పార్టీలుగా ఏర్పడి ప్రభుత్వాల్లో భాగస్వామ్యం పొందిన ఉదాహరణలను ప్రజెంటేషన్‌లో వివరించారు. బీసీలు స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగినప్పుడు పాలనలో భాగస్వామ్యం సాధ్యమవుతుందని, ఇది తెలంగాణకు కూడా వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో మరో కీలక అంశం చర్చకు వచ్చింది. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీ వర్గాలకు చెందిన ముఖ్యమంత్రులు బాధ్యతలు చేపట్టారని, అయితే ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలు (తెలంగాణ–ఆంధ్రప్రదేశ్) మరియు ఒరిస్సాలో మాత్రమే బీసీ ముఖ్యమంత్రి రాలేదని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని మార్చడమే తెలంగాణ లక్ష్యంగా ఉండాలని, తెలంగాణను బీసీ ముఖ్యమంత్రి దిశగా నడిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘చేనేతల రోడ్ మ్యాప్–2028’ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు, సామాజిక చర్చా వేదికలు నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని బీసీ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కొత్త రాజకీయ సమీకరణాన్ని బలోపేతం చేయాలని తీర్మానించారు.

ఈ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో బీసీ వర్గాలు, ముఖ్యంగా చేనేత సమాజం ఒక కొత్త రాజకీయ దిశలో అడుగులు వేస్తున్నట్లు సంకేతమని పలువురు అభిప్రాయపడ్డారు. 2028 లక్ష్యంగా రూపొందించిన ఈ రోడ్ మ్యాప్ ద్వారా తెలంగాణలో బీసీల రాజ్యాధికార ఉద్యమానికి మరింత ఊపొస్తుందని సమావేశంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. చేనేతలు, ఇతర బీసీ కులాలు కలిసి 20 శాతం ఓటు బ్యాంకును రాజకీయంగా సంఘటితం చేయగలిగితే తెలంగాణలో ప్రభుత్వ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి చేనేత సంఘాల ప్రతినిధులు, బీసీ నాయకులు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి వచ్చిన స్పందన అపూర్వంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల దిశనే మార్చే చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు.

చేనేత దినోత్సవం వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న నేత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఇరావతి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ దుడెం వెంకటరమణ, వైస్ చైర్మన్ జక్కని అనిత, అఖిలభారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, పద్మశాలి అన్నసాత్రాల మార్గదర్శి, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు చిలువేరు కాశీనాథ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీశ్వర్, మన ఆలోచన సాధన సమితి అధ్యక్షులు కటకం నర్సింగరావు, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్,*పద్మశ్రీ చింతకింది మల్లేశం, బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, చేనేత ఐక్యవేదిక అధ్యక్షుడు రాపోలు వీరమోహన్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బాసబత్తిని రాజేశం, బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ చైర్మన్ రాపోలు జ్ఞానేశ్వర్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు వనం శాంతి కుమార్, కరీంనగర్ కార్పొరేటర్ వాసాల రమేష్, మాజీ అప్కో డైరెక్టర్ కర్నాటి వెంకటేశం, అయోధ్య అన్న సత్రం అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది బూరం శంకర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు గుంటక రూప, బిసిఐఎఫ్ కోర్ కమిటీ సభ్యులు కర్నాటి మనోహర్, వీరస్వామి, ఇప్పనపల్లి సాంబయ్య, డాక్టర్ అవ్వారు వేణు కుమార్, చెన్న శ్రీకాంత్, చేనేత నాయకులు గంజి మురళి, పాశికంటి లక్ష్మీనరసయ్య, కందగట్ల బిక్షపతి, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం మాజీ అధ్యక్షులు డాక్టర్ కర్నాటి శ్రీనివాస్, ఏలే వెంకటనారాయణ, కరీంనగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్, దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చోళ రాజేశ్వర్, బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ రఘురాం నేత, చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు చిక్కా దేవదాసు, ప్రముఖ జర్నలిస్టు విద్యా వెంకట్, ప్రముఖ న్యాయవాది బాస రాజేశ్వర్, పద్మశాలి సంఘ నాయకులు పొట్టబత్తిని జ్ఞానేశ్వర్, జెల్ల నరేందర్ నేత, వేముల రాము నేత, గడ్డం వెంకటేశ్వర్లు, చిలువేరు యాదగిరి, మహబూబ్నగర్ కార్పొరేటర్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు చేరాల వంశీ తదితరులు పాల్గొన్నారు.

Avatar photo

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.