వరంగల్, జూన్ 12: అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని పద్మశాలి కార్పొరేషన్ మరియు చేనేత కార్పొరేషన్ కార్యకలాపాలు, చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై మంత్రితో వారు సవివరంగా చర్చించారు.

చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, చేనేత కార్మికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, పద్మశాలి వర్గాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ చేనేత మరియు పద్మశాలి వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని చేనేత కార్మికులు, పద్మశాలి కుటుంబాల సంక్షేమం కోసం అవసరమైన సూచనలు, ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు.

Avatar photo

By Murthy