తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శివరాంపల్లి వీకర్‌ సెక్షన్‌ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండారి శంకర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పించేందుకు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌తో పాటు ఎందరో మహనీయులు చేసిన పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి, ఐక్యత, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారుల అవసరాల కోసం సేవాభావంతో రెండు కుక్కర్లను బండారి శంకర్ అందజేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్ ఎం. జ్యోతి చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. చిన్నారుల కోసం వంట సామగ్రిని అందజేసిన బండారి శంకర్‌కు అంగన్వాడీ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు..ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సహాయకురాలు సంగీత, కాలనీ అసోసియేషన్ నాయకులు పి. వెంకటేష్, రఘుకుమార్, పి. శ్రీనివాస్, చిన్నారులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.