తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, రాఘవేంద్ర కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగ స్థానిక ఆటో యూనియన్ లు, కాలనీలోని యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిధులుగా యువ నాయకులైన మహేష్ విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు వందనం చేసి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా యువ నాయకులు మహేష్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం, మహేష్ స్వయంగా విద్యార్థులకు, కాలనీవాసులకు, పేదవారికి చాక్లెట్లు, స్వీట్స్ తో పాటుగా మజ్జిగ ప్యాకెట్స్ ను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువ నాయకులు, కాలనీవాసులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుతూ వేడుకలను విజయవంతం చేశారు.