తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రజా సేవా సమితి, సర్దార్ పటేల్ పార్క్ వాక్ మేట్స్, తానాషా నగర్ నివాసితుల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మణికొండ హుడా కాలనీలోని సర్దార్ పటేల్ పార్కులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు వాసిరెడ్డి నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి నరేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత దేశ ఆర్థిక, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో మరింత పురోగతి సాధించేలా ముందుకు రావాలని సూచించారు. ప్రపంచ శాంతి కోసం భారత్ చొరవ తీసుకోవాలని, దేశ సమైక్యత, సమగ్రత, అఖండతను కాపాడేందుకు ప్రజలంతా పునరంకితం కావాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హుడా కాలనీ పారిశుద్ధ్య కార్మికులకు బహుమతులు అందజేసి వారి సేవలను వాసిరెడ్డి నరేష్ అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు, తానాషా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాజశేఖర్, వయోవృద్ధులు మరియాల మల్లేష్, బుజ్జయ్య, రామారావు, సత్యాలక్ష్మి, హుస్సేన్, మీరావలి, షాకిర్ అలీ, మనోహర్, జె.ఎస్. రావు, వెంకటేష్, సంఘ సేవకులు ఇక్బాల్, శంకర్ రావు, గాబ్రియేల్, సామాజికవేత్త రాఘవ రెడ్డి, సర్దార్ పటేల్ పార్క్ వాక్ మేట్స్ సభ్యులు సుదా రామకృష్ణ, విష్ణు, రేణికుంట భాస్కర్, చంద్రశేఖర్, ప్రజా సేవా సమితి సభ్యులు రాజేష్ రెడ్డి, సత్య రాజు, నీలి శివకుమార్, ఈశ్వర్, ఎంప్లాయిస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పెంటారెడ్డి, ప్రధాన కార్యదర్శి కుమ్మరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
