తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగ ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో స్థానిక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, విద్యార్థులు, యువ నాయకులు, స్థానిక కాలనీవాసులు, అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో కలిసి రాజీవ్ గృహకల్పలోని సీనియర్ మహిళా నాయకురాలైన సుజాత గౌడ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగ జాతీయ జెండాకు వందనం చేసి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
