తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జాతీయ స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఐకమత్యంతో దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని చాటారు.
