తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ డివిజన్ పరిధిలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా,దేశభక్తి ఉప్పొంగేలా నిర్వహించారు. డివిజన్ వ్యాప్తంగా ఉన్న వేమన కాలనీ, దీప్తిశ్రీనగర్ కాలని, ఫ్రెండ్స్ కాలనీ, శంకర్ నగర్ ఫేజ్1, శంకర్ నగర్ ఫేజ్ 2, శీవాజీ నగర్, చందానగర్, వేంకటాద్రి నగర్, సత్య ఎన్ క్లేవ్ తదితర కాలనీల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు సంయుక్తంగా ఏర్పాటుచేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, ఆయా కాలనీల్లో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, నేడు మనమందరం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వేలాది మంది మహనీయుల, అమరవీరుల పోరాట ఫలితమే అన్నారు. మన దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడుకుంటూ,మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. కాలనీల సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం అందుబాటులో ఉంటామని తేలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, కాలనీ అసోసియేషన్ నాయకులు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని మిఠాయిలు పంచుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.