తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని పద్మశాలి పురంలో పద్మ జ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుతూ యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశభక్తి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం యువజన సంఘం సభ్యులు, కాలనీ వాసులు చిన్నారులు పాల్గొన్నారు.