తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు కీ.శే. రాగం సుజాత యాదవ్ అస్థికలను కాళేశ్వరం పుణ్యక్షేత్రంలోని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పూజా కార్యక్రమాలు నిర్వహించి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అస్థికలను గోదావరి మాతకు అర్పించారు. ఈ సందర్భంగా రాగం కుటుంబ సభ్యులు రాగం సుజాత యాదవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారు చేసిన సేవలను స్మరించుకుంటూ కన్నీటి నివాళులర్పించారు. రాగం సుజాత యాదవ్ సేవలు, ఆశయాలు ఎప్పటికీ చిరస్మరణీయం.