తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేడాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో సోమవారం రాత్రి జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్న మెటీరియల్, పనుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు.స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నాయకులు సంబంధిత సిబ్బందిని కోరారు. రోడ్డు నిర్మాణంతో బస్తీ ప్రజల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించనుందని వారు తెలిపారు.