తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ మరియు దేవి నవరాత్రుల సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గం నాయకుడు పూజారి ప్రవీణ్ కురుమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆడపడుచులు ఎంతో సంబరంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రకృతిని దైవంగా పూజించే గొప్ప సంప్రదాయం మనదని అన్నారు. దుర్గామాత దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ పావన పర్వదినాల్లో దేవి నవరాత్రుల ఉత్సవాలు మరియు బతుకమ్మ సంబరాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన కోరారు.
