తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష ధోరణికి నిరసనగా, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, సర్ ప్రక్రియపై పారదర్శకత మరియు జవాబు దారీతనం కోరుతూ ఏఐసీ సీ పిలుపు మేరకు హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ పృథ్వీ చౌదరి , తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుట్ట అమిత్ రెడ్డి, నాంపల్లి కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్ , మాజీ కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవిని కలిసి పరస్పరం మాట్లాడారు. నిరసన కార్యక్రమంలో కావూరి ప్రసాద్, మన్నేపల్లి సాంబశివరావు, తెలంగాణ రాష్ట్ర ఎన్‌ఎస్ యూఐ కార్యదర్శి చంద్రమౌళి, కామినేని వాసు , శశి, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు శ్రీమతి భాగ్యలక్ష్మి, శ్రీమతి రమాదేవి, శ్రీమతి సంతమ్మ, శ్రీమతి మనమ్మ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పాక్షికతకు ప్రాధాన్యత కల్పించాలని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉండేలా సంబంధిత అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమైనదని, ప్రజల ఓటు హక్కు మరియు ఎన్నికల వ్యవస్థపై విశ్వాసాన్ని కాపాడేందుకు పారదర్శకమైన విధానాలు, సమగ్ర సమాధానాలు అవసరమని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రజాస్వామ్యానికి పారదర్శకతే పునాది, ప్రజల విశ్వాసమే ఎన్నికల వ్యవస్థకు బలం. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు , పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
