తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో కాలనీవాసుల పిలుపు మేరకు కాలనీలో పాదయాత్ర చేపట్టిన హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ లో సమస్యల కారణంగా ప్రతిసారి కాలనీవాసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వీటిని దృష్టిలో పెట్టుకొని కొంతమేరకు కొత్త లైన్ వేయాలని కోరడం జరిగిందని, కాలనీలో కొన్ని ఇండ్లు క్రిందికి ఉన్న ప్రాంత వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లెవెల్స్ నిర్మాణం జరిగేలా గౌరవ శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ దృష్టికి తీసుకొని వెళ్లి ఏర్పాటు చేస్తానని కాలనీ వాసులకు చెప్పడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బృందావన్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
