తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: భారత ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయత, సంస్థాగత సమగ్రతను పరిరక్షించాలనే డిమాండ్‌తో, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్లుగా ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టే విధంగా ఎన్నికల సంఘం వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటర్ల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాల్లో మరింత పారదర్శకత ఉండాలని అన్నారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను, ఓటర్ల హక్కులను కాపాడాల్సిన ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు తలెత్తేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
