తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నల్లగండ్ల లోని వర్టెక్స్ కింగ్ స్టన్ పార్క్ విల్లాస్ క్లబ్ హౌస్ లో కీ.శే. రాగం సుజాత యాదవ్ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన పెద్దలకు బియ్యం ఇవ్వడం, దేవాలయంలో గంట కట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ , మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు శేరిలింగంపల్లి, పలు ప్రాంతాల నుండి విచ్చేసిన సీనియర్ నాయకులు, పుర ప్రముఖులు , వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ముందుగా అందరూ కీ.శే. రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, రాగం వారి ఇంట తీరని విషాదం నెలకొందని, మే 9,1996 నుండి 30ఏళ్లకు పైగా రాగం నాగేందర్ యాదవ్ జీవితంలో, ప్రజా సేవలో తోడుగా నిలిచిన రాగం సుజాత యాదవ్ ఇక లేకపోవడం వారికి తీరని లోటన్నారు. కౌన్సిలర్ గా (2000-2005), రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ గా రెండు పర్యాయాలు సేవలందించి, మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన గొప్ప సేవా మూర్తి అని కొనియాడారు. ప్రజలకు సేవలు అందిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలిచారన్నారు. రాగం నాగేందర్ యాదవ్ కి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని వేడుకున్నారు. నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనని నీ జ్ఞాపకాలతోనే ఇక నా మిగిలిన ప్రయాణం మీ కోరిక మేరకు ఇక నా జీవితం ప్రజా సేవకే అంకితం అని రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మన సంప్రదాయం ప్రకారం పెద్దలకు బియ్యం ఇవ్వడం, దేవాలయంలో గంట కట్టే కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. పెద్దల దీవెనలు ఆమె ఆత్మకు శాంతిని చేకూరుస్తాయని తెలిపారు. అనంతరం, విచ్చేసిన వారందరూ భోజనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి, తమ ఆత్మీయురాలికి నివాళులు అర్పించి, తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాములు యాదవ్, ఎంప్లాయిమెంట్ గోపాల్ యాదవ్ కాక, యాదవ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, జాతీయ కార్యదర్శి మహేందర్ యాదవ్, యాదవ్ మహాసభ యువజన విభాగమ అధ్యక్షులు యశ్వంత్ రాజ్ యాదవ్, కే నరసింహ యాదవ్, పాములేటి యాదవ్, తెలుగు సుభాష్ ముదిరాజ్ , సంతోష్ కుర్మా, శీను కుర్మా, సుబ్బయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్, సందీప్ యాదవ్, జయ రెడ్డి, రాధా రాణి రెడ్డి, సౌజన్య, శారద,ప్రజా ప్రతినిధులు, నాయకులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.