న్యూస్ డెస్క్: వరంగల్ నగరం వేణురావు కాలనీకి చెందిన అఖిల భారత బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు, శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు మాజీ సభ్యులు జి.ఎల్. శ్రీధర్ తండ్రి కీ.శే. జి.వి.ఎస్. ఆంజనేయులు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల బోర్డు పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం వారి స్వగృహానికి చేరుకుని నివాళులర్పించారు.

ఆంజనేయులు గారి పార్థివ దేహంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం, ఈగ మల్లేశం వారి కుమారుడు శ్రీధర్ మరియు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆంజనేయులు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ నివాళి కార్యక్రమంలో వరంగల్ మాజీ మేయర్ కక్కే సారయ్యతో పాటు నరేందర్, హరికృష్ణ, రమేష్, సుధాకర్, దయాకర్, దేవేందర్ రాజు, శ్రీధర్, సుభాష్, గణేష్ తదితరులు పాల్గొని తమ సంతాపం వ్యక్తం చేశారు.
