న్యూస్ డెస్క్ : హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన మెగా రైతు మేళా కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్కతో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ముందుగా రైతు మేళ సందర్భంగా మైదానంలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, సాంకేతిక స్టాళ్లను సందర్శించి, రైతులతో మమేకమయ్యారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలపై అధికారులు అందిస్తున్న వివరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ మెగా రైతు మేళా రైతు అభివృద్ధికి దారితీసే కీలక కార్యక్రమమని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రైతులు కష్టపడినా కనీస భద్రత ఉండాలని భావించి ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భద్రత కల్పిస్తూ, రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామని వివరించారు. అలాగే రైతుల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ పనిముట్లను అందజేస్తూ, 50 శాతం సబ్సిడీతో సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.
రైతులు ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా వివిధ రకాల పంటలను పండిస్తూ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ, సన్న బియ్యం ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో రైతులు కూడా ప్రభుత్వాన్ని ఆదరించి, ఈ పథకాల ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, కుడా చైర్మన్, ఇనుగాల వెంకట్రామ రెడ్డి,వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్, హార్టికల్చర్ సెక్రటరీ యాస్మిన్ బాషా, వరంగల్ హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, జిల్లాల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
