న్యూస్ డెస్క్ : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గొడుగుపల్లి గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బేటి బచావో – బేటి పడావో’ కార్యక్రమంలో భాగంగా ‘భేటీ జన్మోత్సవ్’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మద్దెల వనజ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెండోసారి ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు ప్రత్యేకంగా భేటీ జన్మోత్సవ్ కిట్లను పంపిణీ చేశారు.

పోషకాహార పంపిణీ: గర్భిణీలు, బాలింతలకు THR (Take Home Ration) పంపిణీ చేయడంతో పాటు, సుపోషణ దివాస్ సందర్భంగా అవగాహన కల్పించారు.
చట్టాలపై అవగాహన: బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. బాల్య వివాహ నిషేధ చట్టం, మహిళా చట్టాలు, పిల్లల హక్కులపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
రక్షణ కవచం: పోక్సో యాక్ట్ (POCSO), చైల్డ్ లేబర్ యాక్ట్ గురించి చర్చిస్తూ.. ఏదైనా ఆపద కలిగితే చైల్డ్ హెల్ప్ లైన్ 1098, మహిళా హెల్ప్ లైన్ 181 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
జిల్లా మహిళా సాధికారత కేంద్రం: ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశాలను ఆర్థిక అక్షరాస్యత నిపుణులు ఎస్. నాగరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పి. గిరిజ, ఉప సర్పంచ్ దుర్గని దీపికా మధుసూదన్, అంగన్వాడీ టీచర్లు నాగాంజలి, రేఖ, అంగన్వాడీ హెల్పర్లు మరియు తల్లులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *